పళ్ళ బురుసు చిత్రంలో నంద్యాల నటుడు SRS ప్రసాద్ ప్రతిభకు ప్రశంసలు
NANDYAL Aug14:- ఈరోజు విడుదలైన “పళ్ళ బురుసు” చిత్రంలో నంద్యాల ప్రాంతానికి చెందిన SRS ప్రసాద్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.తల్లిదండ్రులను కొడుకులు విస్మరించకూడదనే సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.

చిత్రంలోని తన పాత్రకు SRSప్రసాద్ పూర్తి న్యాయం చేస్తూ అద్భుతమైన నటనను ప్రదర్శించారని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని పేర్కొంటున్నారు.నంద్యాల ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒక మంచి సందేశాత్మక చిత్రంలో తన ప్రతిభను చాటుకోవడం గర్వకారణమని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలు SRSప్రసాద్‌కు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Arattai