,దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NANDYAL Aug15:- నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, లయన్స్ క్లబ్,క్రీడా సమాఖ్య కార్యాలయం వద్ద లయన్స్ అంతర్జాతీయ సంస్థ డిస్ట్రిక్ట్ 316 జె వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, కళారాదన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పతాక వందనం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో అంకితభావంతో పనిచేసి దేశఅభివృద్ధిలో పాలుపంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పి.వి. రమణయ్య,కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు వెంకటరావు, కార్యవర్గ సభ్యులు రంగస్వామి, మధు కుమార్, చలపతి, వీరభద్రుడు, వినోద్, కరీముల్లా, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి,కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు చంద్రమోహన్ ఇమ్మడి రామకృష్ణుడు,రామయ్య,కార్యాలయ కార్యదర్శి మధు, తదితరులు పాల్గొన్నారు
Arattai