SRBC కాలనీలో TIDCO గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
NANDYAL Aug18 :- SRBC కాలనీలోని TIDCO గృహాలలో మౌలిక సదుపాయాలని పూర్తి చేసి లబ్ధిదారులకు గృహాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు.మంగళవారం సాయంత్రం SRBC కాలనీలోని TIDCO గృహాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ ఇంజినీర్, డీఈఈ, TIDCO అధికారుల తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. SRBC కాలనీలో TIDCO గృహాలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారులు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

టిడ్కో గృహాలకు సంబంధించి సంబంధిత అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని మున్సిపల్ మరియు TIDCO అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యం, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజినీర్, డీఈఈ, TIDCO అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Arattai