నంద్యాలలో ప్రధమ రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీలు ప్రారంభం
NANDYAL Aug22 :- ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. టి . చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి సర్దార్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధమ రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలను ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ లయన్స్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ, టోర్నమెంట్ స్పాన్సర్ ఎం.బి.టీ. బాబు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో తైక్వాండో క్రీడ ఒలింపిక్స్ లో గుర్తింపు పొందిన క్రీడ అన్నారు. తైక్వాండో క్రీడ విద్యార్థుల శారీరక ధారుడ్యాన్ని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుందని అన్నారు.ఎం.బి.టీ. బాబు మాట్లాడుతూ తైక్వాండో క్రీడ ను బాలికలు ఆత్మ రక్షణ కోసం తప్పకుండా నేర్చుకోవాలి అన్నారు.తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్ర మౌళి మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. తైక్వాండో శిక్షణ పలు పాఠశాలలలో కోచ్ లు నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ తోపాటు ఎం.బి.టీ.బాబు, రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి చంద్రమౌళి,జఖీ వుల్లా, అబ్దుల్లా, తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సర్దార్, కోచ్ లు మహబూబ్ భాష, బాలకృష్ణ,షానవాజ్, 200 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
Arattai