రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో విజేతలకు అభినందన
NANDYAL Aug25:- ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గత శని, ఆదివారాలలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి చంద్రమౌళి పర్యవేక్షణలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలలో విజయం సాధించిన నంద్యాల పట్టణ క్రీడాకారులను మంగళవారం లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ జిల్లా పి.ఆర్.ఓ. సుధాకర్ రెడ్డి అభినందించారు.నంద్యాల పట్టణంలో సర్దార్, బాలకృష్ణ,షానవాజ్ మాస్టర్లు శిక్షణ ఇచ్చిన వివిధ పాఠశాలలు,కళాశాలలకు చెందిన తైక్వాండో క్రీడాకారులు పలువురు విజేతలుగా నిలిచారు.సర్దార్,షానవాజ్ మాస్టర్లు శిక్షణ ఇచ్చిన క్రీడాకారులు 4 బంగారు పతకాలు,8 రజత పతకాలు,5 కాంస్య పతకాలు సాధించగా, బాలకృష్ణ మాస్టర్ శిక్షణ ఇచ్చిన క్రీడాకారులు 5 బంగారు పతకాలు,3 రజత పతకాలు,3 కాంస్య పతకాలు సాధించారు.ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన మాస్టర్లు సర్దార్, బాలకృష్ణ, షానవాజ్ లకు డాక్టర్ రవి కృష్ణ అభినందనలు తెలిపారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ క్రీడలలో విజయం సాధించినవారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన నిరంతర సాధన మాత్రమే ఏకైక మార్గం అన్నారు.బాలికలకు తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించడం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ జిల్లా పి. ఆర్.ఓ. సుధాకర్ రెడ్డి, కోచ్ లు బాలకృష్ణ, షానవాజ్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు:
సఖియా, ఈశ్వర చారి,మేఘన,సారిక, నాగరామ చరణ్,ప్రణతి సాయి,నవనీత్,సుకుమార్ శామ్యూల్,మోక్షిత.
రజత పతకాలు సాధించిన విజేతలు:
తనుజ,సహారా,మధురిక్ రెడ్డి, మధుసూదన్,మౌనీశ్వర్, సాక్షి,సౌమ్య,రాణి,ధార్మిక్ సాయి,సాయి వర్ధిని,భవ్య శ్రీ.
కాంస్య పతకాలు సాధించిన విజేతలు:
హేమ సాయి,అఫ్రాన్,సమీరా, నిక్షిత్,అష్రాఫ్,ఆదిత్య, సుశాంక్,తమన్.
Arattai