నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ
ఆదివారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో, సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమంలో, సంఘం గౌరవ అధ్యక్షులు, అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న పుల్లయ్య సౌజన్యంతో ఏడు మంది దివ్యాంగులకు 56 వేల రూపాయలతో కొనుగోలు చేసిన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య మాట్లాడుతూ పుల్లయ్య అంథత్వాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో స్టేట్ బ్యాంకులో ఉద్యోగం సాధించడమే కాకుండా తిరిగి దివ్యాంగులకు సహకరించాలని ముందుకు వచ్చి 56 వేలు విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం దివ్యాంగుల సంక్షేమానికి కృషిని నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. వారికి అవసరమైన ఉపకరణాలు అందజేయడం, ప్రతినెల అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడం చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా పుల్లయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ,రమణయ్య లతో పాటు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు వెంకటరావు, కార్యవర్గ సభ్యుడు మురళీధర్, సంఘం కార్యాలయ కార్యదర్శి ఆలా మధు, సలహాదారు శివరామిరెడ్డి,లబ్ధిదారుల బంధువులు పాల్గొన్నారు.
Arattai