IGNOU జాతీయ ప్రవేశ పరీక్షలో ఫిజియోథెరపిస్ట్ డా. శివ బాలి రెడ్డి ప్రతిభ
NANDYAL Sep01:- ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో నంద్యాలకు చెందిన ఫిజియోథెరపిస్ట్, డా. శివ బాలి రెడ్డి కాటసాని** ప్రతిభ కనబరిచారు. ప్రతిష్ఠాత్మక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ (PGDRP) కోర్సులోని భోపాల్ అధ్యయన కేంద్రానికి ఆయన ఎంపికయ్యారని IAP నంద్యాల జిల్లా శాఖ కన్వీనర్ డా. రోహిణి విజయ్, జిల్లా శాఖ ట్రెజరర్ డా. జగదీశ్వర రెడ్డి వెల్లడించారు.RCI గుర్తింపుతో IGNOU నిర్వహిస్తున్న ఈ కోర్సుకు దేశవ్యాప్తంగా ఎనిమిది అధ్యయన కేంద్రాల్లో మొత్తం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో భోపాల్ కేంద్రంలో సీటు సాధించడం డా. శివ బాలి రెడ్డి విద్యా ప్రస్థానంలో మరో మైలురాయని సెంట్రల్ ఫిజియోథెరపీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, IAP తెలంగాణ ప్రెసిడెంట్ డా. పూర్ణచంద్ర శేఖర్ పేర్కొన్నారు. ఈ విజయం ఫిజియోథెరపీ, పునరావాస, విద్యా రంగాలకు గర్వకారణమని IAP సౌత్ జోన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డా. అంజనీ కుమార్ అభినందించారు.ఈ సందర్భంగా డా. శివ బాలి రెడ్డి మాట్లాడుతూ, ఫిజియోథెరపీ, సైకాలజీ, రిహాబిలిటేషన్ విధానాలను సమన్వయం చేసి రోగులకు శారీరక, మానసికపరమైన సమగ్ర పునరావాస సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు.ప్రస్తుతం ఆయన సంస్కృతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ, క్లినికల్ సైకాలజీలో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతున్నారు. శివ బాలి రెడ్డి విజయంపై ఫిజియోథెరపిస్టులు,అధ్యాపకులు, పరిశోధకులు,స్నేహితులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Arattai