నంద్యాల ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
NANDYAL Sep01:- నంద్యాల రోటరీ స్కూల్, హనీఫ్ నగర్లో ప్రైవేట్ పాఠశాలల సంఘం నంద్యాల యూనిట్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.ప్రైవేట్ పాఠశాలల సంఘం నంద్యాల యూనిట్ సెక్రటరీ బాల మదిలేటి సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు బాల్ త్రో, బాల్స్ ఇన్ బాస్కెట్, మెమరీ టెస్ట్, పిక్ ద బాటిల్, మ్యూజికల్ చైర్స్ తదితర వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించారు.

ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థుల బోధన, పాఠశాల నిర్వహణ వంటి బాధ్యతలతో ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారని, వారికి కొంత ఆటవిడుపు, మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఇలాంటి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రైవేట్ పాఠశాలల సంఘం నాయకులు తెలిపారు. క్రీడలు శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ వాసవి, దస్తగిరి, వరప్రసాద్ రెడ్డి, మల్లికార్జున, భాస్కర్, డి.వి. సుబ్బయ్య, సుధీర్, రాజేష్, దశరథ, రామిరెడ్డి, అష్ఫాక్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.ఉపాధ్యాయులలో స్నేహభావం, ఉత్సాహం, మానసిక ఆనందాన్ని పెంపొందించే విధంగా నిర్వహించిన ఈ స్పోర్ట్స్ మీట్ ఉల్లాసంగా సాగింది
Arattai