పర్యావరణ పరిరక్షణకు 15 ఏళ్లుగా మట్టి వినాయకుల పంపిణీ
NANDYAL Sep13:- పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ నంద్యాల పట్టణంలో శ్రీరామ డిజిటల్ అధినేత శ్రీరామ మోహన్ గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు మట్టి వినాయకులను ఉపయోగించాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ హితమైన మట్టి వినాయకులను వినియోగించడం ద్వారా ప్రకృతిని కాపాడటంతో పాటు భక్తి, సంప్రదాయాలను కొనసాగించవచ్చని శ్రీరామ మోహన్ తెలిపారు.

ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల పంపిణీ చేపడుతూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ మోహన్,లైన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, చంద్రశేఖర్ నాగరాజు ఉమ్మడి రామకృష్ణుడు లక్ష్మయ్య గురుస్వామి పాల్గొన్నారు
Arattai