నంద్యాల శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు
NANDYAL Sep14:- ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి,నంద్యాల జిల్లా, నంద్యాల నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (అటానమస్), నంద్యాల సహకారంతో గణేష్ చతుర్థి వేడుకలను కళాశాలలో శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పర్యావరణహిత గణేష్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నంద్యాల – శారదా విద్యాపీఠంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు, శ్రీ రాజశేఖర్ రెడ్డి కార్యదర్శి, రామాంజనేయులు,శంకర్, సత్యనారాయణ సభ్యులు మరియు విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర అధ్యక్షుడు శ్రీ ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ చిలుకూరి శ్రీనివాసులు, శ్రీమతి సుహాసిని తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజించారు.
పంచాయతీరాజ్ ఇంజనీర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు దాదాపుగా 15 రోజులు శ్రమించి పర్యావరణ హిత సహజసిద్ధమైన, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను ఉపయోగించి విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందించిన విగ్రహాలు పూజా కార్యక్రమంలో ఉంచామని. దాదాపుగా 50 చిన్న పెద్ద మట్టితో చేసిన గణనాథుని విగ్రహాలు పూజలందుకున్నారని అన్నారు.
విద్యార్థులలో ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయడం కళాశాల బాధ్యత అని అలాగే సమాజానికి ప్రజలకు ఉపయోగపడే అంశాల పట్ల అవగాహన కలిగించడానికి ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామని దీనికి విద్యార్థులు ఎంతో కష్టపడి గణేష్ ప్రతిమలు సహజమైన మట్టితో తయారుచేసి తమ బాధ్యతను నిరూపించుకున్నారని అన్నారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించిన డీన్ ఆఫ్ అకాడమిక్స్ శ్రీమతి ప్రగతి మేడం ను డాక్టర్ లలితా సరస్వతి శ్రీమతి శ్రావణి కుమారి ని కళాశాల చైర్మన్ అభినందించారు.

విద్యార్థిని స్వయంగా భక్తి పాటలతో పూజలు చేసి పూజా విధానాన్ని అవలంబించారు. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కష్టపడి తయారుచేసిన గణేష్ ప్రతిమలు ఎంతో ఆకర్షనీయంగా ఉన్నాయని విద్యార్థులు సామాజికహిత కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషాన్ని ఇచ్చిందని భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను తెలియజేసేది మన పండుగలని ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. .విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, సంప్రదాయ పండుగలను పర్యావరణహితంగా నిర్వహించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.“భక్తితో వినాయకుడిని ఆరాధిద్దాం… బాధ్యతతో ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో ఈ గణేష్ చతుర్థి వేడుకలు ఆదర్శప్రాయంగా నిలిచాయి.కార్యక్రమంలో నంద్యాల ఎయిమ్ ఫర్ సేవ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి. కళాశాల విద్యార్థులు భక్తి పాటలతో నృత్యం చేశారు.గణపతి బప్పా మోరియా! అంటూ విద్యార్థులందరూ భక్తి పారవశ్యముతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.
Arattai