AMARAVATHI Oct 29 :- • మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• తుఫాన్ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

• సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
• విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేసిన సీఎం.
• ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశం.
• పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలన్న సీఎం.
• తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.
• రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి… 1.16 లక్షల మందికి ఆశ్రయం.
• రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం.
• తుఫాన్ నష్టంపై తాజా వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.

• రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం.
•59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం.
• భారీ వర్షాలతో నష్టపోయిన 78,796 మంది రైతులు.
• రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన 42 పశువులు.

• రాష్ట్రంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు.
• దెబ్బతిన్న 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు… రూ.1,424 కోట్ల నష్టం.
• రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం.

• సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలింపు… 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహణ.
• 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు.
• రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించామని చెప్పిన యంత్రాంగం.
Arattai