నంద్యాల పట్టణంల,బైర్మల్ వీధిలో వెలసిన శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం నందు ఈనెల 20వ తేదీ గురువారం కార్తీక మాస అమావాస్య సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర కల్యాణము నిర్వహిస్తున్నట్లు శశిభూషణ సిద్ధాంతి,భద్రిశెట్టి శివానంద ప్రసాద్ లు తెలిపారు.

ఉదయం శ్రీ బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాయంత్రం 5గంటలకు శ్రీ బసవేశ్వర స్వామి గ్రామోత్సవము నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కావున పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు
Arattai