నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు బాబురావు కుమార్తె బహుళ శ్రీ,హరికృష్ణ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దివ్యాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ , సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ గెలివి సహదేవుడు అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పుట్టినరోజు,వివాహ వార్షికోత్సవం వంటి శుభ కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఇది మంచి సత్సంప్రదాయమని,అందరూ అనుసరిస్తే పేదలకు మేలు జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్,నూతన వస్త్రాల దాత బాబురావు,బహుళ శ్రీ, హరికృష్ణ దంపతులు, వారి కుమార్తె వ్యోమిక శర్మ,జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య,చంద్రమోహన్,పోసిన సుబ్బారావు,కన్నయ్య,సందీప్, మేడం చంద్రశేఖర్,రామయ్య, దివ్యాంగ లబ్ధిదారులు పాల్గొన్నారు.
Arattai