నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ లో ఉన్న శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల బాలికలకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి మంచి విద్యార్థి లక్షణాల గురించిఅవగాహన కల్పించారు.
మహిళా వైద్య విభాగం కార్యదర్శి, గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత నెల వారి ఋతు క్రమ సమయంలో తీసుకోవలసిన శుభ్రత గురించి,మహిళా వైద్య విభాగం నిర్వాహక కార్యదర్శి గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మంచి స్పర్శ,చెడు స్పర్శ లపై, రజస్వల అయిన సమయంలో శరీరంలో వచ్చే మార్పుల గురించిఅవగాహన కల్పించారు.

మహిళా వైద్య విభాగం కార్యవర్గ సభ్యురాలు న్యూరాలజిస్ట్ డాక్టర్ భారతి విద్యార్థులపై మొబైల్,సోషల్ మీడియా ప్రభావం గురించి, ఐఎంఏ నంద్యాల అకాడమిక్ విభాగం కార్యదర్శి డాక్టర్ లలిత మానసిక ఒత్తిడిని అధిగమించడం అన్న అంశంపై, డాక్టర్ అరుణ కుమారి నీతి కథలతో బాలికలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం సామాజిక బాధ్యతలో భాగంగా,”కేర్ బియాండ్ క్లినిక్స్” ( క్లినిక్ లు దాటి సంరక్షణ) అనే పథకం చేపట్టి విద్యా సంస్థలలో వైద్య శిబిరాలు, వివిధ అంశాలపై అవగాహన సదస్సులు ఏడాది పాటు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు పాఠశాల ప్రధానాచార్యులు వెంకటకృష్ణ,పాఠశాల కమిటీ సభ్యులు వసుంధరా దేవి, విద్యార్థినులు పాల్గొన్నారు.
Arattai