ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి ఫరూక్ కు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ అనిల్ కుమార్
ఆదివారం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
NANDYAL Jan 03:-నంద్యాలలో పురాతనమైన ప్రముఖ ఆలయం శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. చైర్మన్ గా నంద్యాలకు చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వి.అనిల్ కుమార్ ను ఎంపిక చేశారు. సభ్యులుగా బి.పద్మావతి, బి. బజరి, యం. నాగయ్య, ఎ. భారతి, ఎం. గురు బాబు,కె.వెంకటలక్ష్మి, ఎన్. జంబులయ్య, జి. వి. సుబ్బయ్య లను నియమించారు.
నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు దేవాలయం ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు. తదుపరి సమావేశం విక్టోరియా రీడింగ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా, గౌరవ అతిధులుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి,పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, విశిష్ట అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,రోటరీ జిల్లా మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామ మూర్తి లను, పట్టణ ప్రముఖులను, నాయకులను ఆహ్వానించామని చైర్మన్ గా ఎంపికైన డాక్టర్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ పదవికి తనను,సభ్యులను ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు,మంత్రి ఫరూక్ కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం తర్వాత ధర్మకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించి మంత్రి ఫరూక్ సహకారంతో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు
Arattai