NANDYAL JAN 08:- ఈనెల 12న ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రం నందు సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.ఎన్.వి రాజు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మహిళలకు తాడాట,తొక్కుడు బిళ్ళ,కర్ర సాము,తాడు లాగుట,పురుషులకు ఏడు పెంకులాట,గాలిపటాలు,తాడు లాగుట,కర్ర సాము లలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తిగల క్రీడాకారులు సాధారణ ప్రజలు డ్వాక్రా మహిళలు మరియు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు మరిన్ని వివరములకు 87126 22576. అనే నెంబర్ ను సంప్రదించాలని కోరారు
Arattai