హాజరైన ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప గిరిజన మండలి సలహా సభ్యులు వెంకటపతి
VELUGODU Jan23: వెలుగోడు మండల కేంద్రంలో చెంచుగూడెం నందు చెంచు జనాల మధ్య రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకలకు సంబంధించి దాదాపు 500 పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు వెంకటప్ప గిరిజన సలహ మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ నారా లోకేష్ బాబు ఈ రాష్ట్రంలోని యువతకు ఆదర్శమని ముఖ్యంగా గిరిజనులకు సంక్షేమ పథకాలను చేరువయ్యే విధంగా కృషి చేస్తున్నారని గిరిజనుల పట్ల విశ్వాసం గా ఉన్నారని గిరిజన గ్రామాల అభివృద్ధి లోకేష్ బాబు తోనే సాధ్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప, టిడిపి రాష్ట్ర నాయకులు గుండాల నాయక్, టీఎస్ ఎఫ్ నాయకులు వెంకటేష్ అంజి నాయక్ లోకు నాయక్ ఎరుకుల సంఘం నాయకులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు

Arattai