ఈనెల 8న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఉచిత వైద్య శిబిరం
నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ నందు గల సాయి బాలాజి నర్సింగ్ హోమ్ నందు ఈనెల 8వ తేదీ ఆదివారము ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు.షుగరు, బిపి, గుండె జబ్బులు ,కిడ్నీ,నరాల జబ్బులు, కంటి జబ్బులు పై అవగాహన కల్పించి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారుECG,2D Echo, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు.ఈ అవకాశాన్ని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రముఖ వైద్యులు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు
Arattai