NANDYAL April 09:-నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గురువారం 2025-26వ సంవత్సరానికి సంబంధించి అకడమిక్ ఆడిట్ జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.

కమిషనరేట్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, వారి ఆదేశాల మేరకు ఈ ఆడిట్ ను నిర్వహించినట్లు తెలిపారు.ఈ అకడమిక్ ఆడిట్ కి అకడమిక్ అడ్వైసర్ లు గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల డోన్ నుండి డాక్టర్ ఎస్ స్వరూప రాణి మరియు డాక్టర్ జి చంద్రశేఖర్ వచ్చి కళాశాలలోని ప్రతి శాఖను తనిఖీ చేసి వారి అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగిందన్నారు.అకడమిక్ ఆడిట్ లో కళాశాల బృందం వారు ఆడిట్ కు సంబంధించిన రికార్డులు చేసిన విధానం బట్టి కళాశాలకు A గ్రేడును ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ సరూప రాణి అకాడమిక్ అడ్వైజర్ మాట్లాడుతూ తనిఖీ చేసిన రికార్డులు ఈ కళాశాలకు నాక్ లో మంచి గ్రేడ్ సాధించడానికి ఈ విధానం పనికి వస్తుందన్నారు. అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాలలోని ప్రతి డిపార్ట్మెంట్లో రికార్డులు మరియు కార్యక్రమాలు అన్నీ చాలా చక్కగా చేశారని ఇదే విధంగా కొనసాగించాలని తెలిపారు.
ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ పార్వతి మాట్లాడుతూ కళాశాల ప్రధానా అధ్యక్షుల వారి సలహాలు మరియు సూచనలు ఈ విజయం సాధించడానికి కారణం అని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎన్ .శశికళ మాట్లాడుతూ అకడమిక్ ఆడిట్ లో ఏ గ్రేడ్ సాధించడానికి సహకరించిన అధ్యాపక అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు
Arattai