NANDYAL May11:- నంద్యాల పట్టణ కేంద్రంలో రేపు జరగనున్న హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకొని పట్టణ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, యాత్ర ప్రశాంతంగా సాగేలా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు

రూట్ మ్యాప్ పరిశీలన
శోభాయాత్ర ప్రారంభ ప్రదేశం నుండి చివరి వరకు గల ప్రధాన కూడళ్లు మరియు సున్నితమైన ప్రాంతాలను ఎస్పీ గారు స్వయంగా సందర్శించారు. ఊరేగింపు సాగే మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

సీసీ కెమెరాల నిఘా
యాత్ర సాగే పొడవునా సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. అంతేకాక ప్రతి అంశం డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని తెలియజేశారు.అనంతరం కంట్రోల్ రూమ్ సందర్శించి సిబ్బందికి దిశానిర్దేశం చేయడం జరిగింది.

సిబ్బందికి దిశానిర్దేశం
విధుల్లో ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు విన్నపం
శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పట్టణ ప్రజలు మరియు భక్తులు పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలను ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ ఎం. జావళి ఆల్ఫోన్స్ IPS గారు, ఇన్స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, అస్రార్ భాష,SI సురేష్ ,శోభాయాత్ర నిర్వాహకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai