NANDYAL May12:- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం నందు వెలసిన శ్రీ ఏకశిల హనుమాన్ దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏకశిలా అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు,ఆకు పూజలు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి, రవితేజలు తెలిపారు.ఆత్మకూరు డిఎస్పి రామాంజనేయులు నాయక్ కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నంద్యాల పట్టణం,NGO కాలని,అమ్మ స్పటిక లింగేశ్వర ఆలయం నందు గల పంచముఖ ఆంజనేయ స్వామికి, హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పంచామృత అభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించారు
Arattai