నంద్యాలలో 40 ఏళ్ల తర్వాత ఆంజనేయస్వామి వారి నిజరూప దర్శనం
NANDYAL :- నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శనివారం అమావాస్య సందర్భంగా ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం భక్తులకు కల్పించినట్లు దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.40 ఏళ్ల తర్వాత స్వామి వారి నిజరూప దర్శనం ఏర్పాటు చేశామని,ప్రతి నెల అమావాస్య రోజున ఆంజనేయ స్వామిని నిజరూప దర్శనం ఉంటుందన్నారు
Arattai