NANDYAL May18 :- నంద్యాల పట్టణంలోని గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అవ్వారి శేషఫణిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొంటూ, శేషఫణి మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అలాగే విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులే నిజమైన జాతి నిర్మాతలని కొనియాడారు. శేషఫణి సాధించిన ఈ గౌరవం నంద్యాల ప్రాంతానికే కాకుండా ఉపాధ్యాయ లోకానికే ప్రేరణగా నిలుస్తుందని అభినందించారు.ఈ కార్యక్రమంలో గురురాజా విద్యాసంస్థల డైరెక్టర్లు షావలి రెడ్డి, మౌలాలి రెడ్డి, ఆర్ జేయుపి రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు భాస్కర రెడ్డి, మల్లికార్జున, లక్ష్మీనారాయణ, లింగమయ్య తదితరులు పాల్గొని శేషఫణిని అభినందించారు.
Arattai