NANDYAL May24 :- నంద్యాల పట్టణంలో మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మహిళల ఉపాధి ప్రోత్సాహానికి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రూ.25 వేల విలువైన ఐదు కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు కేశవమూర్తి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గ్రాంట్ ప్రాజెక్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కుట్టు మిషన్లను అందజేస్తున్నామని తెలిపారు. మహిళల సామాజిక–ఆర్థిక అభివృద్ధే రోటరీ క్లబ్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో నిలబడి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు డివి సుబ్బయ్య, కాల్వ నాగరాజు, అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషఫణి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు రోటరీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Arattai