NANDYAL :- ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలియ సంఘం 10వ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం పేరిట నంద్యాల పట్టణంలో పురస్కారాలు అందజేశారు.

నంద్యాల పట్టణంలోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయ కళ్యాణమండపం నందు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘంఅధ్యక్షులు భీమనపల్లి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు కందగట్ల స్వామి ఉపాధ్యక్షులు వర్ధినరసింహులు ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డం జగన్నాథం గుత్తికొండ ధనుంజయ రావు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగినది.

ఈ సందర్భంగా అధ్యక్షులు భీమనపల్లె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతిభకు పట్టాభిషేకం పురస్కారాలను గత ఐదు సంవత్సరముల నుంచి అందజేస్తున్నామని తెలిపారు. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు మొదటి బహుమతి పదివేల రూపాయలు, రెండవ బహుమతి 7500 మూడో బహుమతి 5000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతులను ప్రతి విద్యార్థిని విద్యార్థులకు 2000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి మరియు ప్రశంసా పత్రం మెమొంటోలు ఇవ్వడం జరిగినది. 140 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రశంసా పత్రములు ఇవ్వడం జరిగినది .అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు అలాగే శ్రీ గుత్తికొండ ధనుంజయ రావు మాట్లాడుతూ మన పద్మశాలి విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి ఐఏఎస్ లో ఐపీఎస్ లు సాధించాలని కోరారు.

పద్మశాలి లందరూ రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంకతి లక్ష్మీనారాయణ గారు పుత్తరామకృష్ణ గాజుల శంకర్ చెన్నా వెంకటేశ్వర్లు జివి రామయ్య సప్ప మణికంఠ చెన్నా శ్రీనివాసులు గాజుల బ్రహ్మ కూడప్పుసుబ్రహ్మణ్యం శిరసాల రామచంద్రుడు కోట బాల వెంకటసుబ్బయ్య గాజుల వేణుగోపాల్ వద్దంటే వెంకట సతీష్ సింగర్ సురేష్ కోడి పరమేశ్వరుడు గాజుల పెద్ద పుల్లయ్య గుర్రం శ్రీనివాసులు మద్దాల మోహన్ కుమార గాజుల ఎర్రయ్య దోమల చక్రపాణి పల్లె ఈశ్వరయ్య చేపూరి మురళీకృష్ణ భీమర పల్లె పురంధర్ కుమార్ తాటబత్తుల సుబ్బ నరసయ్య శ్యామల సోమా బ్రహ్మానందం జోరు బండి శ్యామల గుర్రం కృష్ణవేణి కుల బాంధవులు మహిళ లు మరియు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Arattai