NANDYAL June93:- నంద్యాల పట్టణం, సంజీవ్ నగర్ రామాలయం నందు ఈనెల 5వ తేదీ నుండి 7 తేదీ వరకు భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో
శ్రీ విశ్వశాంతి యాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీభగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు

ఆలయ ప్రధాన అర్చకులు ప్రహల్లాద స్వామి ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పవన్ శర్మ తెలిపారు. లోకకళ్యాణార్థం విశ్వశాంతి యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.5వ తేదీ వివిధ హోమాలతో పాటు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం,6వ తేదీ శనివారం వివిధ హోమాలతో పాటు శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం,7వ తేదీ ఆదివారం లక్ష్మీ గణపతి హోమం, రుద్ర చండీ సహిత సుబ్రహ్మణ్య స్వామి హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు
రాజేంద్రకుమార్, నంది న్యూస్ రిపోర్టర్
Arattai