NANDYAL June05:- నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వశాంతి యాగం మహోత్సవం శుక్రవారం నుంచి ప్రారంభమైంది.ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రహల్లాద స్వామి పండితులు సుదిన్ ద్ర స్వామి అర్చకత్వంలో ఆధ్వర్యంలో ఈ హోమం మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక శాంతి కొరకు విశ్వశాంతి యాగం నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా 5వతేదీ వివిధ హోమాలతో పాటు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం 6వ తేదీ శనివారం వివిధ హోమాలతో పాటు శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం,7వ తేదీ ఆదివారం లక్ష్మీ గణపతి హోమం రుద్ర చండీ సహిత సుబ్రహ్మణ్య స్వామి హోమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai