NANDYAL June13:- నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశమని, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఓటరు నమోదు, ధృవీకరణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ఓటర్ల వివరాలను సరిచూసుకోవడంలో చొరవ చూపాలని, ఎటువంటి తప్పులు లేకుండా జాబితా రూపొందేలా అధికారులు, ప్రజల మధ్య సమన్వయం చేయాలనీ తెలిపారు . మీటింగ్ అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి ఫరూక్ భోజనం చేశారు

ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, జిల్లెల శ్రీరాములు, చాబోలు ఇలియాజ్ , మునగాల విశ్వనాథ్ రెడ్డి , కండే శ్యామ్ సుందర్ లాల్, మిద్దె ఉసేని, గోవిందు నాయుడు, శ్రీదేవి, నాగార్జున మరియు నంద్యాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai