NANDYAL :- నంద్యాల లయన్స్ క్లబ్ 2026 -27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నంద్యాల లయన్స్ క్లబ్ ఎన్నికల కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ సమాఖ్య మాజీ చైర్మన్ ఏ.వి.ఆర్.ప్రసాద్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ,సీనియర్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, డాక్టర్ సహదేవుడు, ఆడిటర్ గోపాలకృష్ణమూర్తి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

అధ్యక్షులుగా ముదియనూర్ సందీప్ కుమార్,కార్యదర్శిగా మేడా చంద్రశేఖర్,కోశాధికారిగా సురేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.ఉపాధ్యక్షులుగా పోసిన సుబ్బారావు,కూర ప్రసాద్,ఇమ్మడి వెంకట రామకృష్ణుడు ఎంపికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ 1970 సంవత్సరంలో ప్రారంభించబడిందని, గత 56 సంవత్సరాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ ప్రజలకు అనేక రకాల సేవా కార్యక్రమాల్ని నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నదని అన్నారు.

నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపికైన సందీప్, చంద్రశేఖర్, కోశాధికారి సురేష్ మాట్లాడుతూ రానున్న సంవత్సర కాలంలో లయన్స్ క్లబ్ తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు,దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ కార్యక్రమాలు,పర్యావరణ,విద్య ,సాంస్కృతిక ,క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
Arattai