NANDYAL June21 :- నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న అమర యోగ వికాస కేంద్రం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సాధన, ధ్యానం, ప్రాణాయామ కార్యక్రమాలను నిర్వహించి యోగా ప్రాముఖ్యతను వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న యోగాచార్యులు, శిష్యులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో యోగాను మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి తీసుకువచ్చిన వ్యక్తి అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి అని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రజలకు అందించడంలో పాములేటి స్వామి విశేష కృషి చేశారని కొనియాడారు.

పాములేటి స్వామి మార్గదర్శకత్వంలో అనేక మంది యోగా సాధకులు తయారయ్యారని, యోగా ద్వారా ఎంతో మంది శారీరక, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందారని తెలిపారు. స్వామి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు యోగానంద యోగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమని, యోగా ప్రచారానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యోగా సాధకులు ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా సాధకులు, శిష్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు
Arattai