NANDYAL June25 :- నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రం నందు నిర్జల ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు దామోదర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం,శ్రీశైలం దేవస్థానాల ప్రవచనకర్త హైగ్రీవాచార్యులు భక్తులతో కలిసి సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు.విష్ణు సహస్రనామ మహిమ,నిర్జల ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి వివరించారు.

విష్ణు సహస్రనామం పఠనం ద్వారా మనస్సు శాంతి, ఆరోగ్యం, సమస్త శుభాలు మరియు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించవచ్చని హైగ్రీవాచార్యులు తెలిపారు.ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, “నిర్జల ఏకాదశి వంటి పుణ్య దినాల్లో సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం మరింతగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
Arattai