సాహితీవేత్త ,దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కు సన్మానం…
NANDYAL June26 :- నంద్యాల పట్టణంలో గత 29 సంవత్సరాలుగా “మోడల్ దంత వైద్యశాల”ను విజయవంతంగా నిర్వహిస్తూ, నాలుగు ఐడిఏ జాతీయ పురస్కారాలు, మూడు రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు.నంద్యాల ప్రాంతంలో దంత వైద్యులకు శిక్షణా శిబిరాలు,మూడు వందలకు పైగా పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి,వేలాది మందికి నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ దంత వైద్యులు, రచయిత డా. కురుమేటి కిషోర్ కుమార్ను ఆయన వైద్య సేవల 29వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు అన్నెం శ్రీనివాస రెడ్డి, అవ్వారి శేషఫణి, డా. నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్ నీలకంఠమాచారి, మహబూబ్ బాషా మిడ్ టౌన్ క్లబ్ కార్యదర్శి ఆర్. వెంకటేశ్వర్లు తదితరులు డా. కిషోర్ కుమార్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.వక్తలు మాట్లాడుతూ, దంత వైద్య రంగంలో విశిష్ట సేవలందించడమే కాకుండా సాహిత్యాభిరుచి కలిగిన రచయితగా డా. కిషోర్ కుమార్ సమాజానికి విలువైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వైద్య వృత్తిలో నిబద్ధత, మానవీయ దృక్పథం, సాహిత్య రంగంలో చైతన్యవంతమైన రచనలు ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని పేర్కొన్నారు. డా. కిషోర్ కుమార్ స్పందిస్తూ, గత 29 సంవత్సరాలుగా తనపై విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య సేవలతో పాటు సాహిత్య సేవలను కూడా కొనసాగిస్తూ సమాజాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని డా. కిషోర్ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Arattai