NANDYAL July19:- ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో గత రెండు రోజులుగా నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాలలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిసాయి.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, జోన్ చైర్మన్ సోమేశుల నాగరాజు అతిథులుగా పాల్గొని రాష్ట్రస్థాయి విజేతలకు, వివిధ వయసు కేటగిరీలలో స్థానాలు సంపాదించిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ క్రీడలలో పాల్గొన్నప్పుడు విజయం సాధించాలనే పట్టుదలతో ఆడాలని, విజేతలుగా నిలిచిన వారు తిరిగి గెలవాలనే ఆకాంక్షతో,విజయం సాధించని వారు భవిష్యత్తులో విజయం సాధించడానికి క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి ,రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్, మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు, చీఫ్ ఆర్బిటర్ వెంకట కుమార్, జిల్లా సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కర్నూలు జిల్లా చెస్ సంఘం కార్యదర్శి కామిశెట్టి శ్రీనివాస్,ప్రతినిధులు నాగ శ్రీనిష్, ఇమామ్, వ్యాయామ ఉపాధ్యాయులు మాలిక్ భాష, శంకర్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుండి వచ్చిన 224 మంది క్రీడాకారులు, కోచ్ లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రాష్ట్ర జట్టు క్రీడాకారులు
నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ ఛాంపియన్ షిప్ పోటీలలో వరస స్థానాలు సాధించి విజేతలుగా నిలిచిన గుంటూరు కు చెందిన మేకల మహేంద్ర తేజ, తిరుపతికి చెందిన స్వర్ణ నిహల్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆదిత్య, గుంటూరు కు చెందిన దొండపాటి దుర్వేశ్ లు ట్రోఫీలు, నగదు బహుమతులు అందుకోవడమే కాకుండా, జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.
Arattai