BAPATLA July25 :- నంద్యాల, జూలై 25: నంద్యాల పట్టణానికి చెందిన విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్ గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం కావడం నంద్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.వ్యవసాయ పరిశోధన రంగంలో, ముఖ్యంగా పంటల అభివృద్ధి, నూతన వంగడాల రూపకల్పనలో డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్ గారు అందించిన విశిష్ట సేవలు రైతాంగ శ్రేయస్సుకు ఎనలేని మేలు చేశాయి. ఆయన అభివృద్ధి చేసిన పలు మెరుగైన వంగడాలు దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి.వ్యవసాయ శాస్త్ర పరిశోధనలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్లలో శనివారం నిర్వహించిన దీక్షాంత మహోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డా.సత్యనారాయణ ,రిజిస్ట్రార్ శ్రీమణి, ఐ.సి.యమ్ .ఆర్ న్యూడిల్లీ డైరెక్టర్ శ్రీనివాసులు,రాష్ట్ర బి.జె.పి నాయకులుకాదరబాద్ నర్సింగరావు,కె శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసన సభ్యులు శ్రీ శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు, అలాగే వివిధ రైతు, సాహితీ, సామాజిక సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నంద్యాలకు చెందిన శాస్త్రవేత్తకు రాష్ట్ర స్థాయిలో ఈ అత్యున్నత గౌరవం దక్కడం జిల్లాకే గర్వకారణమని వారు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్ర పరిశోధనలో డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్ గారి సేవలు భావితరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai