జిల్లాలో బడిబయటి పిల్లల సర్వే 90 శాతం పూర్తి
NANDYAL Aug09 :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబయటి పిల్లల సర్వే 90 శాతం పూర్తయినట్లు ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త ఎం.డి. ప్రసన్నకుమార్ తెలిపారు.
నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో, మండల విద్యాశాఖాధికారుల సంపూర్ణ సహకారంతో క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు మండలాల పరిధిలో బడిబయటి పిల్లల వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.బడిఈడు పిల్లలు ఎవరూ బడిబయట ఉండకూడదన్న లక్ష్యంతో సర్వే నిర్వహిస్తున్నామని, సర్వేలో గుర్తించిన ప్రతి బడిఈడు బాలబాలికను పాఠశాలలో చేర్పించి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రసన్నకుమార్ తెలిపారు.ఇప్పటికే బండి ఆత్మకూరు మండలంలో బడిబయటి పిల్లల సర్వే 100 శాతం పూర్తిచేసినందుకు అక్కడి మండల విద్యాశాఖాధికారులు, సిబ్బందిని డీఈవో జనార్దన్ రెడ్డి,ప్రసన్నకుమార్ లు అభినందించారు.బడిబయటి పిల్లలందరినీ బడిలో చేర్పించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.
Arattai