నంద్యాలలో శ్రీ భాగవత సప్తాహ ప్రవచనాలు ఘనంగా ప్రారంభం
NANDYAL Sep21 :- నంద్యాల పట్టణం సంజీవనగర్ లోని శ్రీ భద్రావతి భావనఋషి దేవాలయం నందు లోక కళ్యాణార్థం ఏడు రోజుల పాటు జరగనున్న శ్రీ భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.మధుర వాగ్వసంత, ప్రవచన సుధాకర, తిరుమల తిరుపతి & శ్రీశైలం దేవస్థానముల వ్యాఖ్యాత డా॥ దీవి హయగ్రీవాచార్యులు గారిచే తొలిరోజు ప్రవచనం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – భాగవతం సాక్షాత్తు భగవత్ స్వరూపమని, భాగవత శ్రవణం వలన మానవ జన్మ తరించి సకల పాపములు తొలగిపోతాయని అన్నారు. భగవంతుని పట్ల నిశ్చలమైన భక్తి, విశ్వాసమే జీవుడిని ముక్తి మార్గం వైపు నడిపిస్తుందని భక్తులకు వివరించారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు జరుగును.కార్యక్రమంలోశ్రీ భద్రావతి భావనఋషి దేవాలయ కమిటీ చైర్మన్ గాజుల వేణుగోపాల్,దుర్గాప్రసాద్ ,నాగేశ్వరరెడ్డి భాగవత సప్తాహ భక్త బృందం పాల్గొన్నారు
Arattai