కిడ్నీ వ్యాధితో పోరాటం…ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు…
NANDYAL Sep22 :- నంద్యాల పట్టణం,బైరమల్ వీధికి చెందిన కుమ్మరి గురుస్వామి భార్య శశికళ గత రెండేళ్లుగా తీవ్ర కిడ్నీ వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతుంది. భార్యను కంటికి రెప్పలా చూసుకోవడం కోసం గురుస్వామి తన మెడికల్ షాపు ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు.కర్నూలు కిమ్స్ వైద్యుల సూచన మేరకు భర్త గురుస్వామి తన కిడ్నీని ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ ఈ శస్త్రచికిత్సకు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చవుతుంది.
తన ముగ్గురు ఆడపిల్లల కోసం ఆ తల్లి ప్రాణాలను కాపాడాలని ఆ నిస్సహాయ భర్త చేతులు జోడించి వేడుకుంటున్నాడు.దాతలు ముందుకు వచ్చి మీకు తోచినంత సహాయం అందించి, ఆ ముగ్గురు ఆడపిల్లల తల్లికి పునర్జన్మ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాడు.

PhonePe / Google Pay:
93980 82597
(కుమ్మరి గురుస్వామి)
Arattai