ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య,ఆరోగ్యం,పోషణకు కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి బాల వీరాంజనేయస్వామి

అమరావతి, అక్టోబర్ 09 :అంబేద్కర్ గురుకులాలు, ఎస్సి సంక్షేమవసతి గృహాల్లో వాటర్ ఇన్ లైన్ క్లోరినేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్ట్ ప్రతినిధులు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, ఎస్సి సంక్షేమవసతి గృహాల్లో వాటర్ ఇన్ లైన్ క్లోరినేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు, గురుకులాలు, వసతి గృహాల్లో వంట మనుషులకు నాణ్యమైన ఆహారం తయారీపై శిక్షణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి టెక్నికల్ సపోర్ట్ కి టాటా ట్రస్ట్ సహకారం అందించే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

కుప్పం, కొండపి నియోజకవర్గాల్లోని గురుకుల పాఠశాలల్లో ఫైలట్ ప్రాజెక్ట్ గా సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి స్వామి కోరారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య , ఆరోగ్యం, పోషణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేద విద్యార్థుల విద్య, సంక్షేమంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు.పేద విద్యార్థుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత