తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వహణతో పాటు విద్య, సామాజిక సేవా రంగాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నంద్యాల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు అన్నెం శ్రీనివాస రెడ్డిని దంత వైద్యుల సంఘం గురువారం ఘనంగా సత్కరించింది.
రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్” నిర్వాహకులు డాక్టర్ గురు ప్రసాద్, డాక్టర్ సుజాత నేతృత్వంలో నిర్వహించిన హాస్పిటల్ 17వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీనివాస రెడ్డిని సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గురు ప్రసాద్ మాట్లాడుతూ గురువులు సమాజ హృదయ స్పందనలయితే సేవాభావం ఆ హృదయానికి ఊపిరి అని పేర్కొన్నారు.
డెంటల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ , డాక్టర్ శ్రావణ్ ,డాక్టర్ సంతోష్ తదితరులు విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభా వికాసానికి తెలుగు పండితులు శ్రీనివాస రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. సన్మాన గ్రహిత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సేవ అనేది వృత్తి కాదని అది మానవత్వం అని తెలిపారు. మన మాతృభాష తెలుగు వైభవానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Leave a Reply