తిరుప్పావై ప్రవచనముల కరపత్రం విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై దివ్య ప్రవచనాలు సంజీవనగర్ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్నట్లు నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు కాదర్ బాద్ రవీంద్రనాథ్ తెలిపారు.
ఆదివారం భారతి సీడ్స్ కార్యాలయంలో ప్రవచనాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.మధుర వాగ్వసంత , వాక్సుధానిధి డాక్టర్ దీవి హయగ్రీవా చార్యులు గారిచే ఈ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుందని వారు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత హయగ్రీవాచార్యులు గత 15 సంవత్సరాలుగా తిరుప్పావై పాశురాలలోని జీవన విలువలు ఆధ్యాత్మిక సందేశాలను అందించి భక్తులను అలరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి భగవత్ సేవా సమాజ్ వారు అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన పేర్కొన్నారు.
కరపత్ర విడుదల కార్యక్రమంలో డా. హయగ్రీవాచార్యులు డాక్టర్ కిషోర్ కుమార్ అన్నెం శ్రీనివాసరెడ్డి ,శేషఫణి నీలకంఠమాచారి,నంది రైతు సమాఖ్య నిర్వాహకులు, కృష్ణారెడ్డి ఓబుళపతి,మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు
Arattai