NANDYAL April13:- రుద్రవరం మండలం భూమనాయుడుపల్లి గ్రామానికి చెందిన రైతు సుధాకర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఆవులను కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా, సంబంధిత రైతుకు నష్టపరిహారం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లోపం కారణంగా సుధాకర్ తన జీవనోపాధికి ఆధారమైన రెండు ఆవులను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సాధారణంగా వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సందర్భంలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం వర్తిస్తుందని, ఈ ఘటనలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా సహాయం అందించే అవకాశం లేదని తెలిపారు.అయితే, రైతు ఎదుర్కొన్న కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, పశుసంవర్ధక శాఖ నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం తరఫున రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి జీవనోపాధిని సాధించుకోవాలని రైతుకు సూచించారు.
Arattai