NANDYAL 28-04-26 :- మే ఒకటి నుంచి 31 తేది వరకు ఎలివేట్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రానా తెలిపారు.నంద్యాల పట్టణంలోని GV మాల్ ఎదురుగా సాయి ఆనందం కాంప్లెక్స్ లోనీ ఎలివేట్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ నందు ఆధ్యాత్మిక గురువు జ్ఞాన ప్రసాద్ గురూజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు రానా మాట్లాడుతూ మే ఒకటో తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే ఒకటో తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు డెమో క్లాసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.Story telling,Role Plays,Grammar,News paper Reading,Calli graphy,Listening Skills,Word Puzzles మొదలగు వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.కావున పట్టణంలోని విద్యార్థిని,విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
Arattai