నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి,ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీ సౌజన్యంతో రెండు చక్రాల కుర్చీలు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లీశ్వరి కి అందజేశారు.

నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాత ఆత్మకూరు సుదర్శనం శెట్టి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, పాల్గొని మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల రద్దీ పెరగడంతో చక్రాల కుర్చీలు అదనంగా అవసరం ఉన్నాయని తెలుసుకుని రెండు మడత పెట్టడానికి అనుకూలంగా ఉండే చక్రాల కుర్చీలు అందజేశామని చెప్పారు.డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తరపున చక్రాల కుర్చీలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శస్త్ర చికిత్స విభాగాధిపతి డాక్టర్ జిలాని, ఆర్ ఎం ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీ ప్రతినిధి ఆత్మకూరు చంద్రమోహన్, లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి,లయన్స్ క్లబ్ కోశాధికారి అమిదేల జనార్ధన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply