నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
NANDYAL Aug07:- ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణంలోని హరిజనపేట అర్బన్ హెల్త్ సెంటర్లో నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.డాక్టర్ నాగమణి డాక్టర్ వసుధ రాణి డాక్టర్ సునీత డాక్టర్ లలితా పాల్గొన్నారు

ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు. పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఉత్తమ ఆహారమని, తల్లిపాల ద్వారా శిశువుకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తి సమృద్ధిగా లభిస్తాయని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా పట్టణంలోని ఎం.ఎస్. నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ కల్పన డాక్టర్ సరిత, జగజ్జనని నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ నర్మదా డాక్టర్ ధనలక్ష్మి, శ్రీనివాస నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ అరుణకుమారి డాక్టర్ నాగరేఖ, ఎన్జీవో కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ సౌజన్య ల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో గర్భిణీలు, బాలింతలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



Arattai