సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రి అత్యాధునిక అంబులెన్స్ ప్రారంభం
NANDYAL Aug16 :- నంద్యాల పద్మావతి నగర్ లో స్టేడియం దగ్గరలో ఉన్న సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రి లో దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రారంభించిన మూడు రోజుల నవజాత శిశువులు, చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరం ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది.

డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్ లు 200 మంది శిశువులను, చిన్న పిల్లలను పరీక్షించి ఒక్కొక్కరికి 2500 రూపాయలు విలువచేసే శిశువుల వినికిడి పరీక్షలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్ ఉచితంగా చేశారు.ఈ సందర్భంగా సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో నవజాత శిశువులు,చిన్నపిల్లల కోసం అత్యవసర చికిత్స అందించే అత్యాధునిక అంబులెన్స్ ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు ప్రారంభించారు. అంబులెన్స్ లో ట్రాన్స్ పోర్ట్ వెంటిలేటర్ ను నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సూర్యన్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్ లు మాట్లాడుతూ ప్రసవం తర్వాత ఆసుపత్రుల నుండి చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో చికిత్స అందిస్తూ తీసుకురావడానికి, దారిలో సమస్యలు వస్తే అవసరమైతే వెంటిలేటర్ అమర్చడానికి అనుగుణంగా అంబులెన్స్ ని రూపొందించామని, ఈ అంబులెన్స్ ద్వారా నంద్యాల జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మణిదీప్, ఆస్పత్రి డైరెక్టర్లు నాగ కుమార్, సుధాకర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Arattai