పంచాయతీరాజ్ ఇంజనీర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం
NANDYAL Sep15 :- మంగళవారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాలలో స్థానిక రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా విభాగం, పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్ల జిల్లా సంఘం, సచివాలయ ఇంజనీర్ల జిల్లా సంఘం సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నంద్యాల విజయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురామిరెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, లయన్స్ అంతర్జాతీయ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు. 30 మంది ఇంజనీర్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
నంద్యాల – శారదా విద్యాపీఠంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

తదుపరి రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రఘురామిరెడ్డి అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి. సుధాకర్ రెడ్డి, డిప్లమా ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు శివ శంకర్, సచివాలయ ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు సంతోష్ రెడ్డి నిర్వహణలో జరిగిన జాతీయ ఇంజనీర్ల దినోత్సవం లో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, లయన్స్ అంతర్జాతీయ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొన్నారు.ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఇంజనీర్ల దినోత్సవాన్ని ప్రారంభించారు.

ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్, షటిల్, చెస్ , క్యారమ్స్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన అసిస్టెంట్ ఇంజనీర్లు ఏడు మంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లలో, మండలానికి ఒకరు చొప్పున 29 మందికి ఉత్తమ సేవ పురస్కారాలు అందజేశారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం

నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ సీనియర్ సభ్యులు, ఇంజనీర్లు సుధాకర్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి ల సహకారంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురామిరెడ్డి, విశ్రాంత ఇంజనీర్లు మురహరి రావు, పి. రాముడు లకు లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్ల దినోత్సవం పురస్కారాలు అందించి సన్మానించారు.ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవజీవన్ బదిరుల పాఠశాల కు క్రీడా పరికరాల కొనుగోలుకు 12 వేల రూపాయలు విరాళాలు అందించారు

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం రెడ్డి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జాతికి చేసిన సేవలను గుర్తుచేసి, వారి స్ఫూర్తితో యువ ఇంజనీర్లు జాతి నిర్మాణంలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి రంగంలో ఇంజనీర్ల పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. సాంకేతికతను పెంపొందించుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మానవజాతి అభివృద్ధి ప్రతి దశలో ఇంజనీర్ల పాత్ర ఉందని, వైద్యరంగం, వ్యవసాయ రంగం, జాతీయ రక్షణ రంగం ఇలా ప్రతి రంగంలో ఇంజనీర్లు సాధించిన ప్రగతి, పరిశోధనలే ప్రపంచ అభివృద్ధికి కీలకంగా ఉన్నాయని ఇంజనీర్ల సేవలను కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ ఇంజనీర్ల సేవలను ప్రశంసించి వారి కి అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చాలని అన్నారు.రామకృష్ణ బిజీ కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ యువ ఇంజనీర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు.

కార్యక్రమాల్లో అతిథులుగా పాల్గొని ఇంజనీర్ల సేవలను కొనియాడిన డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ సహదేవుడు, రామకృష్ణ విద్యా సంస్థలు డైరెక్టర్ హేమంత్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ లను మూడు ఇంజనీర్ సంఘాల తరఫున సత్కరించారు.కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి సచివాలయ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సలహాదారు వంశీధర్, కోశాధికారి కరీముల్లా, పంచాయతీరాజ్ డిఇ లు వహీద్, మన్మధ బాబు, అయాజ్ అహ్మద్, మల్లికార్జున, లక్ష్మీదేవి, నళిని, సుధాకర్ బాబు, రమణ, అసిస్టెంట్ ఇంజనీర్లు శ్రీనివాసులు, సుధీర్ కుమార్ రెడ్డి, వెంకటరాముడు, కమాల్ సాహెబ్, వెంకటరమణ, చెంచయ్య, జయన్న, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ కుమార్,రీజియన్ చైర్మన్ నిజాముద్దీన్, జోనల్ చైర్మన్ నాగరాజు, రవి ప్రకాష్ యూసుఫ్,జనార్ధన్ ,జిల్లా నలుమూలల నుండి వచ్చిన సచివాలయ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Arattai