NANDYAL May18 :-నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రామశేఖర్,మణిపూర్ లోని,బిర్ తికేంద్రజిత్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఎ క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ ఐపీఓ అండర్ప్రైసింగ్ అండ్ లాంగ్-టర్మ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ అనే అంశంపై ఆయన పరిశోధన చేసినట్లు తెలిపారు.ప్రొఫెసర్ డాక్టర్ ఎ. కె. చౌధరి పర్యవేక్షణలో రామశేఖర్ ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు.
కళాశాలకు గర్వకారణం:
కామర్స్ అధ్యాపకుడు రామశేఖర్‌కు డాక్టరేట్ రావడం,ఆయన సాధించిన ఈ ఘనత కళాశాలకే గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది మరియు మిత్రులు రామశేఖర్‌ను అభినందించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Arattai