NANDYAL June1:- నంద్యాల టౌన్ 21 వ వార్డు ఇందిరానగర్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీదేవి గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం, ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు చేరుతున్నాయన్నారు . భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రూ. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ అందిస్తూ, వృద్ధులు, పేద ప్రజల ఆరోగ్యం, మందుల అవసరాలకు ఈ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని . అందుకే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో తాము స్వయంగా భాగస్వామ్యం అవుతున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే ఇందిరానగర్ పరిధిలో రైల్వే లైన్ విస్తరణ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల నివాస సమస్యలను మంత్రి ఫరూక్ పరిశీలించారు. రైల్వే లైన్ పక్కన ఉన్న పేద ప్రజల భద్రత, నివాస అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడామని, అర్హులైన పేదలకు టిడ్కో ఇళ్ళు లేదా ప్రత్యామ్నాయ నివాస స్థలాలు (పట్టాలు) ఎక్కడ కేటాయించవచ్చో పరిశీలించి తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నంద్యాలలో నివసిస్తున్న ప్రతి పేదవాడికి ఒక శాశ్వతమైన ఇల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ నిబద్ధత అని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ వాకా శివశంకర్ యాదవ్, 21వ వార్డ్ టీడీపీ నాయకులు జయప్రకాష్ , తిమ్మయ్య, వెంకటసుబ్బయ్య, పుష్పరాజ్, కే సుబ్బయ్య ,ఈ సుధాకర్ ,జి వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసులు, జి మధు మోహన్ రెడ్డి , రాము రాయల్ , భూపాల్ , సాల్మన్, దీపక్ , చెన్నమ్మ , శ్రావణి, నిరంజన్, జేయుసేనయ్య, రామస్వామి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, గఫూర్ మరియు మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పార్టీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai