లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా డాక్టర్ రవికృష్ణ ఘనవిజయం
NANDYAL June 01:- అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ అనుబంధంగా ఉన్న లయన్స్ జిల్లా 316 జె తాడిపత్రిలో ఆదివారం నిర్వహించిన కన్వెన్షన్ లో నంద్యాల లయన్స్ క్లబ్ తరపున రెండవ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి పోటీ చేసిన నంద్యాల సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్జి.రవికృష్ణ భారీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.

లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ఏరియా లీడర్ సుధాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సదస్సులో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలలో ఉన్న 52 క్లబ్బుల నుండి ఓటింగ్ లో పాల్గొన్న 149 మంది డాక్టర్ రవి కృష్ణకు ఏకగ్రీవంగా ఎస్ ఓటు ద్వారా మద్దతు తెలిపి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నుకున్నారు.

లయన్స్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్ రవి కృష్ణ ఎన్నిక కావడం పట్ల నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు, లయన్స్ ఆంధ్ర ప్రదేశ్ సమాఖ్య మాజీ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్, డాక్టర్ సహదేవుడు, రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, అధ్యక్షులు సోమేశుల నాగరాజు, సీనియర్ సభ్యులు భవనాసి నాగ మహేష్, శ్రీకాంత్, రవి ప్రకాష్, కశెట్టి చంద్రశేఖర్ , మనోహర్ రెడ్డి, షావలి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తాడిపత్రిలో వివిధ జిల్లాల నుండి వచ్చిన లయన్స్ ప్రతినిధులు డాక్టర్ రవి కృష్ణను ఘనంగా సత్కరించారు.రానున్న రెండు సంవత్సరాలు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవి లో, తర్వాత లయన్స్ గవర్నర్ గా ఏడు జిల్లాల పరిధిలో ఉన్న క్లబ్బుల ద్వారా లయన్స్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని డాక్టర్ రవి కృష్ణ ప్రకటించారు.
Arattai