AP-ఉత్తమ గురువును సత్కరించిన విద్యార్థులు….

NANDYAL Oct 15:-మాజీ రాష్ట్రపతి డా”ఎ పి.జె.అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నంద్యాల పట్టణంలోని రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల కాన్ఫరెన్స్ హాలులో డా”గురు ప్రసాద్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అతిథులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పగుచ్చాలతో నివాలులర్పించారు.ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న బలపనూరు ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణిని ఘనంగా సన్మానించారు.

;

ఈ సందర్భంగా దంత వైద్యుడు డా” గురుప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ,నిబద్ధతతో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కృషి చేసిన ఉపాధ్యాయులు శేషఫణి విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు

జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ

ముఖ్య అతిథి డెంటల్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా” కిషోర్ కుమార్ మాట్లాడుతూ గురువు ప్రభావం జీవితాంతం నిలచి పోతుందని విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేసిన ఉపాధ్యాయులు శేషఫణి అభినందనీయుడన్నారు.

సన్మాన గ్రహీత శేషఫణి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులలో సేవాభావాన్ని సృజనాత్మకతను పెంచడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు.జ్ఞానం పంచడం కన్నా గొప్ప సంతోషం లేదని విద్యార్థుల విజయాలు సాధించినప్పుడే గురువులకు నిజమైన పురస్కారం లభించినట్లని పేర్కొన్నారు.

శారదావిద్యానికేతన్ పూర్వ విద్యార్థులు జ్ఞానం పంచిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకొని సత్కరించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని “విద్యార్థి దినోత్సవం”గా నిర్వహించుకోవడం గర్వకారణం అని విద్యార్థులు గురువుల మార్గదర్శకత్వంలో విలువలతో కూడిన విద్య నేర్చుకొని స్ఫూర్తిదాయక పౌరులుగా సమాజంలో మనుగడ సాగించాలని తెలుగు పండితులు అన్నెం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

AP -బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి:కన్నయ్య

ఈ కార్యక్రమంలో కవులు నీలకంఠమాచారి యం.యం.డి రఫీ, కొప్పుల ప్రసాద్, మాబు బాషా అబ్దుల్ కలాం జీవిత విశేషాలను స్పూర్తిదాయక కవితల ద్వారా వినిపించి అలరించారు.ఈ కార్యక్రమంలో రోటరీ పాఠశాల కరస్పాండెంట్ డివి సుబ్బయ్య, వెంకటేశ్వర్లు , డా .సుజాత డా”శ్రావణ్, డా.సంతోష్
పూర్వ విద్యార్థులు శ్రీనివాసులు సంపత్ ప్రభాకర్ రామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.